తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

-

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది విద్యాశాఖ.ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది.

ఉ. 9:30 నుంచి మ. 12:30 వరకు పరీక్షలు ఉంటాయని కాంపోజిట్ కోర్స్, సైన్స్ పేపర్ల వ్యవధి ఉ. 9:30 నుంచి మ. 12:50 వరకు ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది 11 పేపర్లకు బదులు 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు స్కూళ్లకు పంపారు. 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version