నీ అమ్మ అని అంటావా… మీకు అమ్మలేదా – రేవంత్ పై ఈటల ఫైర్

-

వీరుడు ఎప్పుడు కన్నీరు పెట్టడని రేవంత్‌ రెడ్డికి ఈటల కౌంటర్‌ ఇచ్చారు. నిన్న రేవంత్‌ రెడ్డి కంట తడి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఈటల స్పందించారు.సింగరేణి పై నేను మాట్లాడిన… నేను ఎవరి పైన వ్యక్తిగతంగా మాట్లడలేదని తెలిపారు. ఢిల్లీ కేంద్రం గా జాతీయ పార్టీ లు రాజకీయాలు చేస్తాయని అన్నానని.. బీజేపీని ఇరకాటం లో పెట్టేందుకు brs, కాంగ్రెస్ చెట్టాపట్టాలేసుకున్నాయని ఫైర్‌ అయ్యారు.


నీ అమ్మ అని అంటావా… మీకు అమ్మలేదా అని రేవంత్‌ పై మండిపడ్డారు ఈటల. ఇలాంటి పిచ్చి మాటలు మంచివి కావు.. నాకు దైర్యం ఉంది… నా మీద నాకు విశ్వాసం ఉందన్నారు. వంద శాతం నా పంచాయతీ కెసిఆర్ తో, ఆయన నియంతృత్వం, అహంకారం మీద పోరాటం అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎందుకు మాట్లాడలేదు…బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు, పిచ్చి వేషాలు బంద్ చేసుకో అని హెచ్చరించారు ఈటల. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌ కలిస్తే నేను ఉండను అని చెప్పు…అని ఛాలెంజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version