ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ 14 కమిటీలు

-

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా 14 కమిటీలను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ కమిటీలకు చైర్మన్, కన్వీనర్లను నియమించింది. ఎన్నికల మేనిఫెస్టో, పబ్లిసిటి కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జాయింట్ కన్వీనర్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి నియమించింది. అదేవిధంగా స్ట్రీనింగ్ కమిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ కి బండి సంజయ్, చార్జ్ షీట్ కమిటీ చైర్మన్ గా మురళీధర్ రావు, పోరాట కమిటీ చైర్మన్ గా విజయశాంతిని బీజేపీ నియమించింది.

వీరితో పాటు మరికొన్ని కమిటీలకు కూడా నేతలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లో పదాధికారుల సమావేశం నిర్వహించారు. పార్టీ సమావేశానికి బీజేపీ కీలక నేతలు బీ.ఎస్.సంతోష్, సునీల్ భన్సల్ హాజరయ్యారు. ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరిపారు. శుక్రవారం కౌన్సిల్ సమావేశంలో తీర్మాణాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా హాజరు కానున్నారు. ఘట్ కేసర్ లోని వీబీఐటీ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే కౌన్సిల్ సమావేశానికి వేయి మంది నేతలు హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version