ప్రశాంత్ కిషోర్ వ్యూహంతో కేసీఆర్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయంటూ బీజేపీ నేత, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతూ… కాంగ్రెస్ లో చేరుతున్నారని.. అదే విధంగా టీఆర్ఎస్ తో చర్చలు జరుపుతున్నారని లక్ష్మణ్ అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొవడానికి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శక్తి సరిపోదు కాబట్టి… ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని.. అందుకే టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కు దగ్గర చేస్తున్నారని ఆరోపించారు. కార్లో షికార్ చేస్తూ కాంగ్రెస్ ను బలపరుస్తున్నారని… మొదటి నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వేరు కావని మొదటి నుంచి బీజేపీ ఆరోపిస్తుందని ఆయన అన్నారు.
పీకే వ్యూహంతో కేసీఆర్, కాంగ్రెస్ కలిసిపనిచేయబోతున్నారు: బీజేపీ నేత లక్ష్మణ్
-