రాష్ట్రంలో బీజేపీ నేతలను ఎక్కడికి ఆక్కడ అరెస్ట్ లు చేయడాన్ని ఖండిస్తున్నాం అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. బీజేపీ నాయకుల హౌస్ అరెస్టులు దుర్మార్గం. కాంగ్రెస్ ది పేరుకే ప్రజాపాలన కానీ చేస్తుంది విధ్వంస పాలన అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ మూడు నెలల, ఆరు నెలల, అన్వాల్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. కానీ ఫెయిల్ అయిన వాటికి విజయోత్సవాలా అని కాసం ప్రశ్నించారు.
కనీస మార్కులతో పాస్ అవ్వని ప్రభుత్వం సెలబ్రేషన్స్ చేసుకోవడమా అని అడిగారు. ఇక మహబూబ్ నగర్ లో సీఎం సభ ఉంటే నల్గొండ బీజేపీ నేతల అరెస్టులు ఎందుకు. కాబట్టి అరెస్ట్ చేసిన మా వారిని వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు. ఇక వినతి పత్రం ఇవ్వడానికి పర్మిషన్ కావాలా అని ప్రశ్నించిన ఆయన.. పత్రం తీసుకోకుండా చేస్తున్న అరెస్టులను ఖండిస్తున్నాం. ఫుడ్ పాయిజన్ పై ఎంక్వైరీ చేయకుండా ఇతరుల పై నిందలు వేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని కాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.