BRS బాటలోనే కాంగ్రెస్ పాలన..!

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసింది. BRS బాటలోనే కాంగ్రెస్ పాలన నడుస్తుంది. రుణ మాఫీ కాక రైతాంగం నట్టేట మునిగింది అని బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ అన్నారు. ఆగస్ట్ 15 దాటి పది రోజులు దాటినా రుణ మాఫీ చేయలేదు.. రుణమాఫీ పై ఒక్కో మంత్రి ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే యూనివర్సిటి లను స్వాగతిస్తున్నాం. ఉన్న విశ్వ విద్యాలయాల్లో బాత్రూం కి డోర్స్ లేవు. కాబట్టి పాత యూనివర్సిటీల్లో మౌలిక వసతులు కల్పించాలి.

ఇచ్చిన హామీల దృష్టిని మళ్లించేందుకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెరమీదకి తెచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి తెలంగాణకి ఉన్న సంబంధం ఎంటి..? ఆయన విగ్రహాన్ని పెట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలే ఒప్పుకోరు. రాజీవ్ గాంధీ మోసుకొచ్చిన విదేశీ భావజాలం దేశానికి పట్టిన దరిద్రం. రేవంత్ పై రాజీవ్ గాంధీ కుటుంబం ఒత్తిడి ఉంది. ఒత్తిడితోనే వారానికి రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్. ఒక్క కుటుంబానికి భజన, ఊడిగం చేసేలా రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అని సోలంకి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version