డబుల్ బెడ్ రూం మోసగాళ్లను పట్టుకున్న పోలీసులు..!

-

డబుల్ బెడ్ రూం లు ఇప్పిస్తామని మోసం చేసిన ముఠా ను పట్టుకున్నారు పోలీసులు. ప్రముఖ నేతల పేర్లు చెప్పి కోట్లు దండుకున్న ముఠా.. డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయినట్టు ఫేక్ పాత్రలు సృష్టించి అమాయకులను బురిడీ కొట్టించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. అధికార ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాకు తెలుసు అని అమాయకులకు దగ్గరయ్యారు. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరు చెప్పి.. డబ్బులు వసూలు చేశారు.

ముఠా కి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. సురేందర్ అని ఈ ముఠాలో కీలక వ్యక్తి. 29 లక్షల రూపాయల వరకు క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు. ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు ముఠా సభ్యులు. అనుమానం వచ్చిన లబ్దిదారులు నిలదీస్తే.. ముఠా లో అశ్విని అనే మహిళా RDOగా మాట్లాడింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా మరికొందరిని మోసం చేసింది ఈ ముఠా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా డబ్బులు దండుకున్నారు. ఇలా ఇప్పటివరకు కోటి 28 లక్షలు కాజేసినట్లు గుర్తించాం. ఎవరు ఎలాంటి సహాయం కోసం వచ్చినా.. చేసి పెడతామని నమ్మించారు. ప్రభుత్వ పెద్దలు, నేతలు, అధికారులకు కాల్స్ చేసినట్లు.. తమ ముఠా సభ్యులే ఒకరికి మరొకరు కాల్స్ చేసుకుని స్పీకర్ ఆన్ చేసి అమాయకులను మోసం చేశారు అని రాచకొండ సీపీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version