బిజెపి అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ – రేవంత్ రెడ్డి

-

బిజెపికి కొత్త అర్థం చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బిజెపి అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. బ్రిటిష్ విధానాలనే బిజెపి అమలు చేస్తుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ కి స్వతంత్రం వచ్చేది కాదని అమిత్ షా అంటున్నాడని.. వల్లభాయ్ పటేల్ కి మీ పార్టీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడని అన్నారు రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ ని నిషేధించింది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పేర్కొన్నారు. గాంధీభవన్ కి పునాది వేసింది కూడా వల్లభాయ్ పటేల్ అని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడింది కర్ణాటకలో అయితే గుజరాత్ లో కేసు ఎలా వేస్తారని ప్రశ్నించారు.

అదానీ దోపిడీపై పార్లమెంటులో మోడీని రాహుల్ గాంధీ కడిగేసారని.. దాంతో రాహుల్ గాంధీని చూడాలంటేనే మోడీకి భయం పట్టుకుందన్నారు. అదాని కంపెనీలో 23 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఎవరో తేలాలన్నారు. అదానీ దొంగతనం చేశారంటే మోడీ ఎందుకు భయపడుతున్నాడని నిలదీశారు రేవంత్ రెడ్డి. అదానిపై ఈడి విచారణ జరగాలంటే మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version