లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటనకి తప్పుడు సమాచారం బయటికి వెళ్తుంది. కలెక్టర్, అధికార యంత్రాంగం మొత్తం లగచర్ల గ్రామనికి భూ సేకరణ కార్యక్రమం కోసం, ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చారు. అంతే కానీ బలవంతగా గుంచు కోవడం కోసం కాదు అని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు అన్నారు. రాష్ట్రము ఒక ఎత్తు అయితే.. కొడంగల్ ఒక ఎత్తు. కొడంగల్ ను అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. కానీ ఇక్కడ రాజకీయం చేసి అభివృద్ధి అడ్డు కోవాలనే ప్రయత్నం జరుగుతుంది.
మిడి మిడి జ్ఞానంతో రైతులను KTR రెచ్చ గొట్టిండ్రు. నిజం గా రైతులు యెక్కడ కూడా అధికారుల పై దాడులు లు చేయరు. వాళ్లకు కావాలిసిన పరిహారం ఎక్కువ కావాలని అడుగుతారు. కానీ ఓ పక్క ప్రణాళిక ప్రకారం KTR కుట్రలు పన్ని, నరేందర్ రెడ్డి తో దాడులు చేయించారు. రేవంత్ రెడ్డి రైతు కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి.. రైతుల కోసం సహసోపేత మైన నిర్ణయాలు తీసుకోని వారికీ మేలు చేసారు. అక్కని పూర్తిగా లగచర్ల ఘటన ను కలుషితం చేసారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారు అని మల్లు రవి పేర్కొన్నారు.