BJP MLA Raja Singh responded on Hydra: హైడ్రానా.. హైడ్రామానా..ఓవైసీకి రేవంత్ భయపడ్డాడు అంటూ చురకలు అంటించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హైడ్రాపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఓవైసీ ఫాతిమా కాలేజ్ ను ఎప్పుడు కూల గొడతారో టైమ్ డేట్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

ఫాతిమా కాలేజి ను కూల్చకుంటే హైడ్రా ఫెయిల్ అయినట్టేనని మండిపడ్డారు. హైడ్రా నా హైడ్రామా నా అని చర్చ జరుగుతుందన్నారు. ఓవైసీ వార్నింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డారా అని ఎద్దేవా చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ బిల్డింగ్ కూల్చితే సీఎం రేవంత్ రెడ్డి మీరు తెలంగాణ హీరో అవుతారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.