బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తాజాగా ఆపరేషన్ అయిందట. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అధికారిక ప్రకటన చేశారు. నాకు హర్నియా ది ఆపరేషన్ అయింది నేను 15 డేస్ వరకు రెస్ట్ లో ఉంటాను ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభిమానులు, ఆయన నియోజక వర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇది ఇలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఇటీవలే హత్య యత్నం జరిగిన సంగతి తెలిసిందే. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. దీంతో అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నారు మంగళహాట్ పోలీసులు.