కవిత మెడ మీద కత్తి వేలాడుతోంది… ఎపుడైనా ఆమె అరెస్ట్ కావొచ్చు – BJP

-

కవిత మెడ మీద కత్తి వేలాడుతోంది… ఎపుడైనా ఆమె అరెస్ట్ కావొచ్చు… తప్పకుండా అరెస్ట్ అవుతుందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం హెచ్చరించారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉంది.. అవినీతి విషయం లో కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్‌ ఇచ్చారు. BRS, MIM, కాంగ్రెస్ ల బంధాన్ని ప్రజల ముందు పెడతామన్నారు.

తెలంగాణ లో అధికారం లో ఉంది brs పార్టీ… ప్రశ్నలు మాత్రం బీజేపీని అడుగుతుంది…ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆగ్రహించారు. ఎక్కడ చూసినా అవినీతి… ప్రాజెక్ట్ లు మనీ మేకింగ్ మెషీన్ లు అయ్యాయన్నారు. Brs విపక్ష కూటమి కి మద్దతు ఇస్తుంది..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కు సేవా చేస్తా అని అధికారం లోకి వచ్చి కెసిఆర్ కుటుంబం తెలంగాణ ను లూటీ చేస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version