BIG BREAKING : తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జనగామ జిల్లాలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కుమార్ ను జనగామలో పోలీసులు అరెస్ట్ చేశారు.
నిన్న కల్వకుంట్ల కవిత ఇంటి దగ్గర.. బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా.. దీక్ష చేయాలని బండి సంజయ్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దీక్షకు కుర్చుకున్నారు. అయితే.. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. దీక్షను భగ్నం చేసి, బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు.
బండి సంజయ్ కుమార్ ను స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.