తడిబట్టలతో ప్రమాణం చేసిన బిజెపి సిద్దిపేట అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి

-

సిద్దిపేట బిజెపి పార్టీలో దుమారం రేపింది. సిద్దిపేట బిజెపి అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి పసుపు బట్టలతో ప్రమాణం చేశారు. తాను మంత్రి హరీష్ రావుకు కోవర్టును కాదని ఆయన పసుపు నీళ్లు పోసుకుని…. తడిబట్టలతో ప్రమాణం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారికి ఇదే సమాధానం అని పేర్కొన్నారు.

తడిబట్టలతో ప్రమాణం చేసిన బిజెపి సిద్దిపేట అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి

కాగా, శ్రీకాంత్ మంత్రి హరీష్ కోవర్టు అని… బిజెపిని నాశనం చేస్తున్నారని… సొంత పార్టీలోని కొంతమంది నేతలు విమర్శించారు. ఈ క్రమంలో ఆయన పసుపు బట్టలతో ప్రమాణం చేశారు. కాగా… సిద్దిపేట నియోజక వర్గంలో భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున మంత్రి హరీష్‌ రావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు సిద్దిపేట నియోజక వర్గంలో మంత్రి హరీష్‌ రావు ఓడిపోలేదు. దాదాపు 30 ఏళ్లు గా మంత్రి హరీష్‌ రావు ఎమ్మెల్యేగా కొనసాగు తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version