శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఓ విమానంకు బెందిరింపు కాల్ వచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వెళ్లేందుకు టేకాఫ్ తీసుకోవడానికి రన్‌వే మీదకు వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ 6ఈ-6323లో బాంబు ఉందని సమాచారం అందడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.

ప్రయాణికులను కిందకు దించి తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్ నడుస్తోంది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం ఐంది. హైదరాబాద్ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కేంద్రం. దింతో తెలంగాణలో హై అలర్ట్ నడుస్తోంది.