సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్?

-

సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడనుందా ? అంటే అవును అనే అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రోజుకు మూడు బహిరంగ సభలలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. హెలికాప్టర్లో తిరిగి… అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే.. ఓ మూడు రోజుల వరకు ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ దూరం కనున్నట్లు సమాచారం అందుతుంది.

దీనికి కారణం రాజ శ్యామల యాగం. సేమ్ కేసీఆర్ ఇవాల్టి నుంచి రాజ్యశ్యామల యాగం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజులపాటు సీఎం కేసీఆర్ దంపతులు ఈ యాగంలో పాల్గొననున్నారు. ఏపీ మరియు కర్ణాటక కు చెందిన 200 మంది పురోహితులు ఈ యాగానికి హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ యాగం నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటించే జిల్లాల పర్యటన క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా షెడ్యూల్ ప్రకటించిన ప్రకారం సీఎం కేసీఆర్ ఇవ్వాలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మరియు ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే అంతకుముందు ఆయన ఎర్రవలిలో మూడు రోజులపాటు జరిగే రాజ్యశ్యామల యాగాలలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎర్రవల్లికి చేరుకున్నారు. మరి ఇవాళ జరిగే సభలకు సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version