హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కి భారీ ఊరట లభించింది. పది రోజుల వరకు కేటీఆర్ ని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈనెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక విచారణకు సహకరించాలని కేటీఆర్ కి సూచించింది.
విచారణ జరపుకోవచ్చని ఏసీబీకి సూచించింది. సుదీర్ఘ సమయం పాటు విచారణ చేపట్టిన ధర్మాచనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు లాయర్ ఏజీ సుదర్శన్ రెడ్డి చేసిన వాదనలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు.
ఏసీబీ కేసు పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వాదనలు చేపట్టిన ధర్మసనం పది రోజుల వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయవద్దని సూచించింది. ఈ కేసులో కేటీఆర్ తరఫున సీనియర్ లాయర్ ఆర్యమా సుందరం సుమారు రెండున్నర గంటలకు పైగా వాదనలు వినిపించారు. ఇక తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి.