ఒక్క వ్యక్తి కోసం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కొట్లడుతున్నాం : కౌశిక్ రెడ్డి

-

మేము పదే పదె ఒక్క వ్యక్తి కోసం కొట్లడుతున్నారు అంటున్నారు. కానీ మేము నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కొట్లడుతున్నాం అని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన వల్ల ఫార్ములా ఈ రేస్ సంస్థ లండన్ లో కేసు పెట్టింది. అందుకే పోడియం వద్దకు వెళ్లి పోరాటం చేశాం. అసెంబ్లీ లోపల సెక్యూరిటీ పెట్టుకొని సభ నడుపుతున్నారంటే.. ఎంత చేతకాని వాళ్ళో అర్ధం అవుతుంది. హైదరాబాద్ ను ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా కేటీఆర్ చూపించాడు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో చిప్ప కుడు తిన్నాడు కాబట్టి.. అందరికీ చిప్ప కుడు తినిపించాలని అనుకుంటున్నాడు.

కానీ ఇదే కేటీఆర్ కి రేవంత్ రెడ్డి కి ఉన్న తేడా. సభలో ఏక పక్షంగా మా విడియో మాత్రమే విడుదల చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం తెలంగాణ ప్రజానీకానికి చూపించినందుకు ధన్యవాదాలు. షాద్ నగర్ ఎమ్మెల్యే చెప్పు చూపిన వీడియో కూడా బయట పెట్టాలి అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version