ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి ఓటర్లను ప్రభావితం చేశారనే అభియోగాలతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ బిఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ హైకోర్టుని గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఓటర్లను ప్రభావితం చేశారని అందులో ప్రస్తావించారు.
దీనిపై విచారించిన హైకోర్టు రాజాసింగ్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రేమ్ సింగ్ రాథోడ్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫీడవిట్ లో పూర్తి సమాచారం ఇవ్వలేదని బిఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ పిటిషన్ వేశారు.