పెళ్లయిన మూడో రోజుకే లారీ ఢీ కొట్టి ఓ నవవధువు మరణించింది. పీజీ ప్రవేశ పరీక్ష రాసి వస్తానని వెళ్లి రోడ్డు ప్రమాదంలో.. మరణించింది ఓ నవవధువు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో జరిగింది.

ఈ గ్రామానికి సంబంధించిన ముద్దసాని అఖిల కు ఈనెల ఆరవ తేదీన రాజు అనే యువకుడితో పెళ్లి జరిగింది. అయితే ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన అఖిల.. శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా తిమ్మాపుర్ మండలం రామకృష్ణ కాలనీలో ఉన్న కళాశాలలో పీజీ పరీక్ష రాయాల్సి వచ్చింది. దీంతో భర్త పర్మిషన్తో… పరీక్ష రాసింది. పరీక్ష రాసి ఇంటికి వస్తున్న నేపథ్యంలో… వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. దీంతో అఖిల అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త రాజుకు స్వల్ప గాయాలు అయ్యాయి.