బీఆర్ఎస్ ప్రభత్వం ప్రజల నెత్తిన నష్టాల భారాన్ని మోపింది : ప్రొఫెసర్ కోదండరాం

-

ఛతీస్ గడ్ తో కరెంట్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల పై విద్యుత్ విచారణ కమిషన్ ముందు ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. అందులో విద్యుత్ లో దాదాపు 80వేల కోట్లకు అప్పులు చేశారని తెలిపారు. ప్రధానంగా యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లను ఎలా కాపాడుకోవడం అనేది అనుమానమే అన్నారు.

ఛతీస్ గడ్ లో 2000 మెగావాట్లకు ఒప్పందం చేసుకుంటే కనీసం 200 మెగావాట్ల విద్యుత్ కూడా రాలేదు. 2022 తరువాత సరఫరా పూర్తిగా ఆగిపోయింది. గత ప్రభుత్వం ఒప్పదం చేసుకొని రద్దు చేసుకోవడం వల్ల దాదాపు రూ.250 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పాత పరికరాలతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మించారని తెలిపారు.  ఛతీస్ గడ్ విద్యుత్ కొనుగోలు చేసి ఎంఓయూ రూట్ ఎందుకు చేశారు అని ప్రశ్నించారు. విద్యుత్ శాఖను 80వేల కోట్ల అప్పుల్లోకి నెట్టేశారు. ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version