మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి మద్దతు తెలిపింది బీఆర్ఎస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారికి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ.
ఇక అంతకు ముందు తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అసెంబ్లీ ప్రారంభం అవ్వగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై సంతాప తీర్మానం గురించి ప్రస్తావిస్తూ లీడర్ ఆఫ్ ది హౌస్ సీఎం రేవంత్ రెడ్డిని మాట్లాడవలసిందిగా కోరారు. అనంతరం సీఎం రేవంత్ మాజీ ప్రధాని మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నదని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నదని చెబుతూ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ
మన్మోహన్ సింగ్ గారికి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ pic.twitter.com/sMm3c25US5
— Telugu Scribe (@TeluguScribe) December 30, 2024