పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ షాక్‌..సుప్రీం కోర్టులో మరో పిటీషన్‌ !

-

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ షాక్‌ ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ ఇవాళ జరుగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు..సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

brs-congress

శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ లు టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇప్పటివరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు. ఈ తరుణంలోనే ఇవాళ ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ల ధర్మాసనం విచారణ జరుపనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version