పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైంది – చంద్రబాబు

-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్‌ చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఇలా అవడానికి కారణం ఎవరు?? పదేళ్లు ఎవరు పరిపాలించారు?? అంటూ నిలదీశారు.

chandrababu slams aap party

అదే పదేళ్లు డబల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉండి ఉంటే వాషింగ్టన్ ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేదంటూ ఆప్‌ పార్టీపై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బిజేపి కి ఎందుకు ఓటెయ్యాలో ఢిల్లీలో చేసిన ఎన్నికల ప్రచారంలో చెప్పానని… “ఆప్”ది విఫలమైన రాజకీయ సిద్ధాంతం అన్నారు. యమునా నది తీవ్రంగా కాలుష్యమయు పోయుందని… ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమయమైన నగరంగా ఢిల్లీ అపఖ్యాతి చెంగిందని ఆగ్రహించారు. మురికి నీరు, తాగు నీరు కలిసిపోయ సరఫరా అవుతోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version