బీఆర్‌ఎస్ పార్టీ మొత్తం కొనేస్తా అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాక్యలు చేశారు. BRS పార్టీని కొనేంత డబ్బు బీసీల వద్ద ఉందని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో ఆయన మాట్లాడారు.
‘‘2028లో వచ్చేది బీసీల రాజ్యమే. తెలంగాణకు చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే. తెలంగాణలో EWS రిజర్వేషన్లు రద్దు చేయాలి. లేకుంటే ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ’’ అని అన్నారు.
మా దగ్గర డబ్బులు లేవని ఎవడు అన్నాడు
మా దగ్గర అడ్డగోలుగా పైసలు ఉన్నాయి
పైసలు లేని బికారులు మీరు
రేపు పొద్దున వరకు కేసీఆర్ పార్టీని కొనేంత డబ్బులు మా దగ్గర ఉన్నాయి – కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న pic.twitter.com/5vKD72HxHE
— Telugu Scribe (@TeluguScribe) February 2, 2025