గణేష్ ఉత్సవాలను బీఆర్ఎస్ రాజకీయాల కోసం వాడుకుంటోంది : బండి సంజయ్

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కుట్రలు, కుతంత్రాలు, కుంభకోణాలు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. గణేష్ ఉత్సవాలను రాజకీయాల కోసం బీఆర్ఎస్ వాడుకుంటుందని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్లాది రూపాయు విరాళాలు అందజేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

కరీంనగర్ లోని పలు కాలనీలలో గణేస్ మండపాలను పరిశీలించారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.10వేల వరకు సీఎం కేసీఆర్ పంపిణీ చేశారని ఆరోపించారు. గ్రూపు 1 పరీక్ష రద్దుపై స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో సీఎం చెలగాటం ఆడారని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలే కాదు.. టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోవడంతో బండి సంజయ్.. పిల్లల భవిష్యత్ అంధకారంలో మగ్గుతుందని యువత తల్లిదండ్రులు గుర్తించాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version