టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇవాళ చంద్రబాబుపై కోర్టులో పలు పిటిషన్లు వేశారు. కొన్ని పిటిషన్లను కోర్టు తిరస్కరించగా.. మరికొన్నింటిని వాయిదా వేడయం.. వాదించడం ఇలా చోటు చేసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. శాంతియుతంగా చేపడుతున్న ఈ ఆమరణ దీక్షకు అందరూ సహకరించాలని కోరారు. చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిటాల రవీంద్ర హత్య కేసులో నిందితులను రెడ్డిపల్లి జిల్లా జైల్లోనే హత్య చేశారని పరిటాల సునీత గుర్తుచేశారు. పరిటాల సునీత ఆమరణ నిరాహార దీక్షకు జనసేన రాష్ట్ర నేత భవాని రవికుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సీపీఐ నేత మల్లికార్జున సంఘీభావం తెలిపారు.