Uppal: బీఆర్‌ఎస్‌ నాయకులపై రాడ్లు, కర్రలతో దాడి

-

Uppal: బీఆర్‌ఎస్‌ నాయకులపై రాడ్లు, కర్రలతో దాడి జరిగింది. ఉప్పల్ లో గంజాయి బ్యాచ్ హల్చల్ సృష్టించింది. తెరాస నాయకుడు ఈగ సంతోష్ తో పాటు మరో ఏడుగురిపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో తెరాస నాయకుడు ఈగ సంతోష్ తో పాటు మరో ఏడుగురు ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు.

BRS leaders were attacked with rods and sticks

ఉప్పల్ శాంతి నగర్ లో గంజాయి ముఠా హల్చల్ చేసింది. క్రికెట్ ఆటలో యువకుడిపై బ్యాట్ తో దాడి చేశారు. ఇదే విషయంపై అడిగేందుకు వెళ్లిన తెరాస నాయకుడు ఈగ సంతోష్ తో పాటు మరో ఏడుగురి పై రాడ్లు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. దీంతో తెరాస నాయకుడు ఈగ సంతోష్ తో పాటు మరో ఏడుగురు ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులను కుడా తరిమిన గంజాయి బ్యాచ్…ప్రస్తుతం పరారీలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version