హైదరాబాద్ నుంచి పొమ్మనడానికి నువ్వు ఎవడ్రా అంటూ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు. శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా.. హైదరాబాద్ మహా నగరంలో సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు.
అందరూ మన బిడ్డలే.. దయచేసి ఆంధ్ర, తెలంగాణ అనే భావం తేవద్దు అని కోరారు కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు. హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకొంటున్నారు.. నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయిన మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు.
హైదరాబాద్ నుండి పొమ్మనడానికి నువ్వు ఎవడ్రా
ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు
శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా..
హైదరాబాద్ మహా నగరంలో సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు
అందరూ మన బిడ్డలే.. దయచేసి ఆంధ్ర,… https://t.co/i6oQQXdhQC pic.twitter.com/JoU7zi6nfh
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2024