BREAKING: BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హౌజ్‌ అరెస్ట్‌ !

-

BRS MLA Padi Kaushik Reddy house arrest:  BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హౌజ్‌ అరెస్ట్‌ అయ్యారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్, బీఆరెస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాల్ల మధ్య కౌశిక్ రెడ్డి హౌజ్ అరెస్ట్ అయ్యారు. అంతేకాదు… కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట మోహరించారు పోలీసులు. అంతేకాదు… 144 సెక్షన్‌ కూడా అమలు చేస్తున్నారు.

BRS MLA Padi Kaushik Reddy house arrest

కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ మీద రూ. 100 కోట్ల ఫ్లై యాష్ స్కాం ఆరోపణలు చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. మంగళవారం ఉదయం చేల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తే ఆధారాలతో నిరూపిస్తూనని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ సవాల్ విసిరారు. అయితే…హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ సవాల్ పై స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్ ప్రజలకు నా నిజాయితీ నిరూపించుకోవడానికి హనుమాన్ టెంపుల్ వద్దకు వస్తున్నా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version