ఓటీటీలోకి ‘భజే వాయు వేగం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

టాలీవుడ్ యంగ్ నటుడు కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా ‘భజే వాయు వేగం’ . ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 31వ తేదీన విడుదలైంది. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. హ్యాపీడేస్ స్టార్ రాహుల్ టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ఆడియన్స్‌కు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. జూన్‌ 28వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

భజే వాయు వేగం సినిమాలో ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్ లతోపాటు శరత్ లోహితస్వ కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు రధన్ సంగీతం అందించగా, కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రం ఓటీటీలో వస్తుండడంతో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version