బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తప్పిన రోడ్డు ప్రమాదం

-

తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని శృంగేరి పీఠం సందర్శనకు వెళ్తుండగా మంగుళూరు సమీపంలోని ముడూరు- నల్లూరు క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టింది ఎమ్మెల్యే వాహనం. ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు ఎమ్మెల్యే. కర్నాటకలోని ఉడిపి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బులెట్ ప్రూఫ్ వాహనం కావడంతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈ ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై స్పందించారు రోహిత్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదాల వల్ల తను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఈ ఉదయం బెంగళూరు, (ఉడిపి) దగ్గర యాక్సిడెంట్ అయినట్టు వస్తున్నా వార్తలు వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ ప్రమాదంలో తనకి ఎటువంటి గాయాలు కాలేదన్నారు. మీ అందరి ప్రేమానురాగాల వలన తాను క్షేమంగానే ఉన్నానన్నారు. నా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, నా శ్రేయోభిలాషులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని పైలెట్ రోహిత్ రెడ్డి తమ వాట్సాప్ గ్రూప్ లో కార్యకర్తల ద్వారా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version