బయట బీజేపీ వాళ్లు మాట్లాడేదే.. లోపల సీబీఐ అడుగుతోంది : కవిత

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎశ్ కవితకు ఇవాళ్టితో గడువు ముగియడంతో అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టుకు వెళ్లే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇది సీబీఐ కస్టడీలా లేదని, బీజేపీ కస్టడీలా ఉందని అన్నారు. బయట బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, అడుగుతున్న ప్రశ్నలే.. లోపల సీబీఐ అధికారులు అడుగుతున్నారని తెలిపారు. ఈ కేసులో రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకే బీజేపీ ఇలా చేస్తోందని ఆరోపించారు.

సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అధికారులు ఈ కేసును మరింత విచారించాల్సి ఉందని కవిత మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని కోరారు. న్యాయస్థానం 9 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత మరోసారి తిహాడ్ జైలుకు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version