కల్వకుంట్ల కవిత బాధితురాలు కానీ, నిందితురాలు కాదని BRS ఎంపీలు పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీ లను బలహీన పరచి, లొంగదీసుకునే ప్రసత్నంలో భాగంగానే బిఆర్ఎస్ నాయకురాలు కవిత అరెస్ట్ అని ఆగ్రహించారు. భిన్నత్వం లో ఏకత్వం గా ఉండే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే ప్రయత్నాలు సరైనవి కావని నిప్పులు చెరిగారు నామా నాగేశ్వరరావు.
ప్రభుత్వ విధానాలు మారినప్పుడు ఆకర్షణగా ఉంటే, వ్యాపారులు ముందుకు రావడం సహజమేనని…మహిళను అరెస్ట్ చేయడం సహేతుకం కాదని మండిపడ్డారు. కేసిఆర్ కు తెలంగాణ ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు నామా నాగేశ్వరరావు. న్యాయం జరుగుతుంది, ఇది కొత్తదేమీ కాదు….కేసిఆర్ అభ్యుదయ భావాలతో పాలన కొనసాగించారన్నారు సురేష్ రెడ్డి. “శక్తి” అని అనగానే, ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డారని తెలిపారు సురేష్ రెడ్డి.