దేశవ్యాప్తంగా ఏ పార్టీ వారు గెలుస్తారని చర్చ జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గేయం మార్పుపై రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న చిహ్నం, గేయాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించగా దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలోనే… బీఆర్ఎస్ పార్టీ పెను సంచలన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అధికారిక చిహ్నం మార్పిడిపై నేడు బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయనుంది. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకుంది బీఆర్ఎస్ పార్టీ. చార్మినార్ చిహ్నం తొలగింపుపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఉదయం 10.30 గంటలకు చార్మినార్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో.. చార్మినార్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.