రఫా నడిబొడ్డుకు ఇజ్రాయెల్‌.. నగరాన్ని వీడిన 10 లక్షల మంది పాలస్తీనియన్లు

-

గాజాలోని రఫా నగరంలోకి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) దూసుకెళ్తున్నారు. మొన్నటిదాక శివార్లకే పరిమితమైన ఐడీఎఫ్, ఇప్పుడు నగరం మధ్యలోకి చేరుకుని హమాస్‌ మిలిటెంట్లతో హోరాహోరీ పోరు సాగిస్తోంది. మరోవైపు మందుపాతర పేలి ముగ్గురు సైనికులు మృతి చెందినట్లు బుధవారం ఐడీఎఫ్‌ తెలిపింది. మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొంది. రఫాలో పరిమిత యుద్ధం మాత్రమే చేస్తున్నామని ఐడీఎఫ్‌ చెబుతున్నా దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం రాత్రి జరిగిన వైమానిక దాడిలో 45 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 లక్షల మంది పాలస్తీనా పౌరులు రఫాను వీడి వెళ్తున్నారు.

మరోవైపు ఈజిప్టు-గాజా సరిహద్దు మొత్తాన్ని ఇజ్రాయెల్‌ తన నియంత్రణలోకి తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈజిప్టును ఆనుకొని ఉన్న ఈ ఫిలడెల్ఫి కారిడార్‌ దక్షిణ గాజాలోని రఫాలో ఉంటుంది. ఇటీవల రఫా క్రాసింగ్‌ను ఆక్రమించిన ఇజ్రాయెల్‌.. ఇప్పుడు మొత్తం సరిహద్దు ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడం గమనార్హం. ఈజిప్టు-గాజా సరిహద్దుల్లో భారీస్థాయిలో సొరంగాలు ఉన్నాయి. వీటి ద్వారా హమాస్‌కు ఆయుధాలు అందుతున్నాయని ఇజ్రాయెల్‌ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version