కలెక్టర్‌ పై దాడి చేయించింది రేవంత్‌ సోదరుడు తిరుపతి రెడ్డినే – కేటీఆర్‌

-

కలెక్టర్‌ పై దాడి చేయించింది రేవంత్‌ సోదరుడు తిరుపతి రెడ్డినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ కోసం వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. లగచర్ల, హాకింపేట రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారన్నారు. రాబందుల్లా రేవంత్ రెడ్డి పేదల భూములు గుంజుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు.

ktr

తొమ్మిది నెలలు ఎవరు పట్టించుకోకుంటే అధికారులు వస్తే నిరసన తెలిపితే తప్పా అంటూ చురకలు అంటించారు. ఘటనతో సంబంధం లేని వారిని కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహించారు. దుగ్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ అనుచరులే ఈ దాడి చేశారని చెబుతున్నారని… సీఎం రేవంత్ అన్నే ఈ దాడి డైరెక్షన్ ఇస్తున్నారని రైతులు చెప్పారని బాంబ్‌ పేల్చారు.

పోలీసులు లగచర్ల రైతుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలు పెట్టారన్నారు. కొడంగల్ సీఐ, ఎస్ఐ వికారాబాద్ ఎస్పీ వీళ్ళంతా కలిసి లగచర్ల రైతుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలు పెట్టారని ఫైర్‌ అయ్యారు. కాళ్ళు, చేతులు కమిలిపోయి ఉన్నాయి మేజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదు అని అడిగితే.. చెప్తే మల్లి కొడతాము, మీ ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళని కూడా కొడతామని బెదిరించారని చెప్పారంటూ కేటీఆర్ వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version