మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నన్ను మోసం చేశాడు : బాధితుడు నరసింహ రెడ్డి

-

దగ్గరి బంధువు కదా అని నమ్మితే తనను మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మోసం చేశాడని బాధితుడు నరసింహ రెడ్డి మీడియాకు వివరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా యాడారంలో నా 23ఎకరాల వ్యవసాయ భూమిని కొంటానని మల్లారెడ్డి నన్ను సంప్రదించాడు. ఎకరం రూ.2 కోట్ల చొప్పున మాట్లాడుకున్నాడు. మొదలు మొత్తం కొంటానని నమ్మించి తర్వాత రూ.8 కోట్లు మాత్రమే చెల్లించాడు.

దగ్గరి బంధువే కదా అని మొత్తం డబ్బులు ముట్టకుండానే ఆయనకు రిజిస్ట్రేషన్ చేశాను. నాకు ఇంకా రూ.15 కోట్ల వరకు నగదు రావాలి. మల్లారెడ్డి కొనుగోలు చేసిన భూమికి వెనుకవైపున నాకు భూమి ఉంది. దానికి కూడా దారి లేకుండా చేశాడు. అదేంటని అడిగితే అది కూడా నేనే కొనుక్కుంటానని చెప్పి.. అసలు చెల్లించాల్సినవి కూడా ఇవ్వడం లేదు.ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. నాకు న్యాయం చేయాలని కోరతానని చెప్పాడు. కాగా, దీనిపై మల్లారెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version