రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసన.. కేటీఆర్ ప్రకటన

-

రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ అన్ని గ్రామాలు, మండల, జిల్లా, రాష్ట్రా కేంద్రాల్లో నిరసన చేపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం స్థాయిలో ఉండి తెలంగాణ కంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే బావుండేది అని నికృష్టపు మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి.

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని తెలిపారు. ఆనాడు రైతు బంధు కింద రూ.10వేలు ఇస్తే.. బిచ్చం అన్నారు. ఇప్పుడు మీరు రైతులకు ఇప్పటి వరకు ఏమి ఇచ్చారు అని ప్రశ్నించారు. నిన్న రేవంత్ రెడ్డి రూ.12వేలు ఇస్తామని చెబుతున్నారు. ఆర్థిక పరిస్తితి బాలేదంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాలేదు అని చెప్పడానికి సిగ్గులేదా..? అని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ రైతాంగానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త కంపెనీలు రావడానికికే భయపడుతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version