రైతు సంక్షేమం కోసం బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తోంది – మంత్రి హరీష్ రావు

-

రైతు సంక్షేమం కోసం బిఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తుందని అన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. నేడు నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

అచ్చంపేట నియోజకవర్గంలో గతంలో కరెంటు కష్టాలు ఉండేవని.. ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంటును కేసీఆర్ ప్రభుత్వం అందిస్తోంది అన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఏడాదికి రెండు పంటలు పండించుకునే విధంగా సాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version