సోషల్ మీడియా కార్యకర్త ప్రశాంత్ ఇంటికి వెళ్లారు కేటీఆర్. చెన్నూరు పట్టణంలోని మారెమ్మవాడలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ప్రశాంత్ ఇంటికి వెళ్లారు కేటీఆర్. ప్రశాంత్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకొని వారి ఇంట్లో భోజనం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిందని.. మహిళలకు రూ. 2,500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, రైతు భరోసా, బోనస్, తులం బంగారం, స్కూటీలు ఇలా ఎన్నో హామీలు చెప్పారు.
ఏదైనా ఒక్కటైనా అమలైందా? అని నిలదీశారు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు.. మరి రుణమాఫీ అయ్యిందా? పెద్దపల్లి అభ్యర్థి కోటీశ్వరుడు కదా? ఆయన అయినా సరే ఇచ్చిండా రైతులకు ఏమైనా ఇచ్చిండా? అని ఫైర్ అయ్యారు. అయిన సరే మొండి చెయ్యికి గుద్దుదామా? కాంగ్రెస్ మళ్లీ ఓటు వేద్దామా? అని ప్రశ్నించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.