వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 25 సీట్లే వస్తాయని అన్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల్లో చాలామంది బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ డబ్బులు ఇచ్చి మరీ బరిలోకి దించుతున్నారని ఆరోపించారు.
కల్వకుంట్ల కవితకు కేసిఆర్ టికెట్ ఇస్తే 33% మహిళలకు టికెట్ ఇచ్చినట్లేనని ఎద్దేవా చేశారు బండి సంజయ్. కెసిఆర్ ప్రకటించిన 115 మందిలో సగం మందికి బీఫామ్ ఇవ్వరని అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ మళ్ళీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమేనని ఎద్దేవా చేశారు. కెసిఆర్ మళ్ళీ గెలిస్తే చంద్రునిపై కూడా భూములు ఇస్తామంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.