మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు !

-

తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ పై కేసు నమోదు అయింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో మంత్రి కొండా సురేఖ పై ఫిర్యాదు చేశారు బిఆర్ఎస్ మహిళా కార్పరేటర్లు. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఫిర్యాదు చేశారు. మహిళ అయ్యుండి సాటి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు..బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో మంత్రి కొండా సురేఖ పై ఫిర్యాదు చేశారు.

BRS women corporators filed a complaint against Minister Konda Surekha at Banjara Hills police station.

బంజారాహిల్స్ ఏసిపి వెంకటరెడ్డి, సి ఐ రాఘవేందర్ లకు వేరువేరుగా ఫిర్యాదు కాపీలను అందజేశారు..వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య, హేమ తదితరులు. మంత్రి సురేఖ పై పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసు అధికారులు న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కొండా సురేఖ తక్షణమే మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు నటీమణులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version