ఢిల్లీకి బయలుదేరిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

-

నేటి నుంచి 23 వ తేదీ వరకు ఈడి కస్టడీలో ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పరిచింది ఈడి. కవితను గంటపాటు రోజు కలిసేందుకు ఆమె భర్త అనిల్ ,కుటుంబ సభ్యులకు సమయం కేటాయింపులు చేశారు. కవిత తో పాటు మరికొందరిని సోమవారం ఈడి విచారణ కు పిలిచే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇక ఈ తరుణంలోనే.. కవితను కలిసేందుకు ఢిల్లీకి పర్యటించారు కేటీఆర్‌.

BRS Working President KTR left for Delhi

అయితే… ఢిల్లీ లిక్కర్స్ స్కాం లో 292 కోట్ల రూపాయల వ్యవహారాన్ని తేల్చాల్సి ఉందని…292 కోట్ల రూపాయలు వ్యవహారంతో కవితకు సంబంధం ఉందని ఈడీ ఆరోపణలు చేసింది.100 కోట్ల రూపాయలను అప్ పార్టీకి హవాలా రూపంలో ఇచ్చారని…హైదరాబాదులోని కోహినూర్ హోటల్ విజయనాయర్ , అరోరా లు కలిసి సమావేశం అయ్యారని వెల్లడించింది ఈడీ. ఢిల్లీలోని సోడాపూర్ వద్ద రెండు బ్యాగులలో నగదును వినోద్ చౌహాన్ కి అందించారని…అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బు మొత్తాన్ని ఆప్ నేత వినోద్ కు ఇచ్చాడని ఆరోపణలు చేసింది ఈడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version