KTR: దానం, కడియం, తెల్లం పదవులు ఊడటం ఖాయం..ఉప ఎన్నికలు తప్పవు

-

KTR: దానం, కడియం, తెల్లం పదవులు ఊడటం ఖాయం..ఉప ఎన్నికలు తప్పవని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చిందని చురకలు అంటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయం అని హెచ్చరించారు.

BRS Working President KTR on party changed persons

పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు.. మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని వార్నింగ్‌ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహించారు. న్యాయస్థానాల్లో, ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version