తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.30కోట్ల చేనేత రుణాలను మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లి లలితా కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(IIHT) ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా రూ.30 కోట్ల చేనేత రుణ మాఫీ బాధ్యత నాది. రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి ఆదేశాలిస్తున్నా.. రుణమాఫీ వార్తతో నేతన్నలు సంతోషంగా ఇంటికెళ్లి.. కడుపునిండా భోజనం చేయాలి. ఇందిరమ్మ ప్రభుత్వంలో చేతి, కుల వృత్తులకు సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే IIHT విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సాహకం అందించారు. ఇందుకోసం రూ.290 కోట్ల నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మహిళలకు ప్రతీ ఏడాది రెండు చీరలను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు స్వయం సహాయక, సెల్ప్ హెల్ప్ గ్రూపుల్లో దాదాపు 63 లక్షల మంది ఉన్నారని.. వారందరికీ ఏడాదికి రెండు చీరలను చేనేత కార్మికులు నేస్తారని వెల్లడించారు.