ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా ? – కేటీఆర్‌

-

ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా ? అంటూ ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌. జీ న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మన్నే క్రిశాంక్ పరామర్శించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కేటీఆర్‌ పోస్ట్‌ పెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో..జీన్యూస్ రిపోర్టర్, కెమెరామెన్ లను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. విధి నిర్వహణలో భాగంగా… జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా ? అంటూ ఆగ్రహించారు.

ktr in delhi press meet

మొన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద..మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన..ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీన్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టు అంటూ నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా ? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా ? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం ? అంటూ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు అడగడుగునా దర్శనమిస్తున్నాయన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version