ఓల్డ్ సిటీలో భారీ ప్రమాదంపై కేటీఆర్ కీలక ప్రకటన

-

BRS Working President KTR:  హైదరాబాద్ లోని పాతబస్తిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సంఘటనపై తాజాగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాద సంఘటన తనను బాధించిందని ఎమోషనల్ అయ్యారు కేటీఆర్.

BRS Working President KTR responds to Gulzar House fire incident
BRS Working President KTR responds to Gulzar House fire incident

గాయపడ్డ వారిని వెంటనే ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. తగిన ఎక్స్ గ్రేషియా ప్రకటించి వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పాత బస్తిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో .. మృతుల సంఖ్య 17కి చేరింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్…విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news