చిన్నారికి స్కూల్ బ్యాగ్‌ను అందించిన KTR

-

చిన్నారికి స్కూల్ బ్యాగ్‌ను అందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. హైడ్రా కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఇక అటు హైడ్రా కూల్చివేతల వలన ఆత్మహత్య చేసుకొని చనిపోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…భరోసాఇచ్చారు.

BRS Working President KTR visited the family of child Vedashree who lost their homes due to hydra de molitions

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ… అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారన్నారు. హైడ్రా అనే బ్లాక్‌మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి.. నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని చెప్పారు. పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకొనివ్వకుండా పేదల ఇళ్లు కూలగొడుతున్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version