తెలంగాణలో మండుతున్న ఎండలు.. నిర్మల్ లో అత్యధికం..!

-

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఎండలు భగ్గున మండుతున్నాయి. తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా భానుడు భయాందోళనకు గురి చేస్తున్నాడు. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. సాధారణం కంటే అధిక ఉస్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశముంది. 

ప్రధానంగా తెలంగాణలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో ఇవాళ 43 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంగనర్, వరంగల్ జిల్లాలలో 42, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లాలని.. ఎండలకు వడదెబ్బ కొట్టే అవకాశం ఉందని మధ్యాహ్నం వేళలో అస్సలు బయటికి వెళ్లవద్దని సూచిస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version